Thursday, 8 December 2016

జవాహర్ లాల్ నెహ్రూ

జవాహర్ లాల్ నెహ్రూ, (Jawaharlal Nehru) (నవంబర్ 14, 1889 – మే 27, 1964) భారత దేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్యపోరాటములో ప్రముఖ నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు మరియు చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.

జవాహర్ లాల్ నెహ్రూ

బాల్యం


నెహ్రూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాదు నగరంలో జన్మించాడు. స్వరూపరాణి, మోతీలాల్ నెహ్రూ దంపతులకు మొదటి సంతానం. వీరు కాశ్మీరుకు చెందిన సరస్వతి బ్రాహ్మణ కులమునకు చెందినవారు. న్యాయవాది ఉద్యోగ నిమిత్తము కుటుంబం అలహాబాదుకు వలస మార్చింది. మోతీలాల్ న్యాయవాదిగా బాగా రాణించి, తన కుటుంబానికి సకల సంపదలు సమకూర్చారు. నెహ్రూ మరియు అయన తోబుట్టువులు అనంద్ భవన్ అనబడు ఒక భవంతిలో ఉంటూ, దుస్తుల విషయంలో హావాభావాల వ్యక్తీకరణలో పాశ్చాత్య నాగరికులవలె మెలిగేవారు. వీరంతా హిందీ, సంస్కృతంతో పాటు ఆంగ్లములో కూడా తర్ఫీదు ఇవ్వబడినారు. నెహ్రూ 15 సంవత్సరాల వయస్సులో ఇంగ్లాండుపయనమయ్యాడు. అంతకముందు విద్యాబ్యాసం అంతా ఇంటి వద్ద మరియు ప్రపంచవ్యాప్తంగా పేరోందిన పాఠశాలలందు జరిగింది. మొదట ఇంగ్లాండులో హారో పాఠశాలలో ఆ తరువాత ట్రినిటీ కళాశాలలో విద్యనభ్యసించాడు. "జొ" అను ముద్దు పేరుతో పిలిచేవారు.

నవ భారత రూపశిల్పి


ఆయన భారత దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి మరియు అందరికంటే ఎక్కువకాలం పనిచేసిన ప్రధాన మంత్రి. వీరి పదవీ కాలం 1947 నుండి 1964 వరకు సాగింది. భారత స్వాతంత్ర్య సంగ్రామ ప్రముఖ నాయకుడైన నెహ్రూ, స్వంతంత్ర భారతదేశ మొదటి ప్రధానిగా కాంగ్రెస్ పార్టీచే ఎన్నుకోబడ్డారు.పిమ్మట 1952 లో భారతదేశ మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందినపుడు ప్రధాని అయ్యారు. అలీనోద్యమ స్థాపకుల్లో ఒకరైన నెహ్రూ యుద్ధానంతర కాల అంతర్జాతీయ రాజకీయాలలో ముఖ్య వ్యక్తి. ఆయనను పండిట్ నెహ్రూ అని, (సంస్కృతంలో "పండిట్" గౌరవసూచకము ) భారతదేశంలో పండిట్ జీ (జీ, మర్యాద పూర్వక పదం) అని పిలిచేవారు.

భారత దేశంలో సంపన్న న్యాయవాది మరియు రాజకీయ వేత్త అయిన మోతిలాల్ నెహ్రూ కుమారుడైన నెహ్రూ, యువకునిగా ఉన్నప్పుడే భారత జాతీయ కాంగ్రెస్లో వామ పక్ష నాయకుడయ్యారు. బ్రిటిష్ సామ్రాజ్యం నుండి సంపూర్ణ స్వాతంత్ర్య సముపార్జనకు అనుకూలుడైన నెహ్రూ,మహాత్మా గాంధీ సలహాలతో, ప్రజాకర్షణ కలిగిన సంస్కరణ వాద నాయకుడిగా ఎదిగి కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. దీర్ఘ కాలం కొనసాగిన భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ముఖ్యపాత్ర వహించి గాంధీగారి రాజకీయ వారసునిగా గుర్తించ బడ్డారు. జీవిత పర్యంతం స్వేచ్ఛా వాదిగా ఉన్న నెహ్రూ, పేద దేశాల దీర్ఘకాల ఆర్ధిక అభివృద్ధిసమస్యలు ఎదుర్కోవటానికి నిలకడతో కూడిన సామ్యవాదం మరియు ప్రభుత్వ రంగంఅనుకూలమని భావించారు.

ఆగష్టు 15 1947లో భారత దేశం స్వాతంత్ర్య్యం సంపాదించినపుడు న్యూఢిల్లీలో స్వతంత్ర భారత పతాకాన్ని ఎగురవేసే గౌరవం దక్కిన ఏకైక భారతీయుడు నెహ్రు. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, స్వేచ్ఛా వాద సుగుణాల పట్ల గుర్తింపుతో పాటు పేద మరియు అణగారిన వర్గాల పట్ల వ్యాకులత, నెహ్రూ తన విధానాలు రూపొందించటంలో దిశానిర్దేశం చేసి భారతదేశ సిద్ధాంతాలను నేటికి కూడా ప్రభావం చేస్తున్నాయి. ఇవి ఆయన సామ్యవాద మూలాలతో ప్రపంచాన్ని అవలోకనం చేసుకోవడాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రధాన మంత్రి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుడైన నెహ్రూ, తన పార్టీ సభ్యుల ఆధిక్యత కలిగిన పార్లమెంటు ద్వారా హిందూ స్త్రీల దాస్య విముక్తికి మరియు సమానత్వ సాధనకు ఉద్దేశింపబడిన అనేక న్యాయ సంస్కరణలు ఆమోదింప చేసారు. ఈ సంస్కరణలలో వివాహ కనీస వయోపరిమితిని పన్నెండు నుండి పదిహేనుకు పెంచడం, మహిళలను వారి భర్తల నుండి విడాకులు పొంది, ఆస్తి వారసత్వాన్ని పొందేలా శక్తివంతం చేయడం, వినాశకరమైన వరకట్న విధానాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించడం ఉన్నాయి.ఆయన సుదీర్ఘ పదవీకాలం స్వతంత్ర భారత దేశ సంప్రదాయాలు, విధానాలు రూపొందించటంలో సాధనంగా ఉంది.ఆయనను కొన్ని సందర్భాలలో 'నవ భారత రూపశిల్పి'గా పేర్కొంటారు. ఆయన కుమార్తె, ఇందిరాగాంధీ, మరియు మనుమడు, రాజీవ్ గాంధీ కూడా భారతదేశ ప్రధానమంత్రులుగా పనిచేసారు.

No comments:

Post a Comment