Thursday, 8 December 2016

బంధాలను బలపరచుకోండి

ఏమండీ! మీ అమ్మగారి పుట్టినరోజు వస్తోందికదా! మీ అమ్మగారికి ఒక సెల్ ఫోను
కొనిద్దామా? మీరేమంటారు? " అంటూ శ్యామల తన భర్త శేఖర్ ను అడిగింది.

శేఖర్ తన తండ్రి చనిపోయిన తరువాత తన ఇద్దరి చెల్లెల్లకు పెళ్ళిళ్ళు చేసి
భాద్యతలన్నీ నెరవేర్చి అమ్మ చూసిన సంబంధం చేసుకున్న మంచి
మనిషి.........శ్యామల కూడా మంచి అమ్మాయే! తన చెల్లెళ్ళు ఇద్దరూ
ఇంటికి 2 కి.మీ దూరంలోనే ఉన్నారు. శ్యామలకూడా ఉద్యోగం చేస్తుంది.శేఖర్ , శ్యామల ఇద్దరూ ఆఫీసుకు వెళ్ళిపోయాక శేఖర్ అమ్మగారు
పక్కనే ఉన్న గుడికి వెళ్ళడం....టీ.వీ చూడటం.........ఇరుగుపొరుగుతో
కాసేపు మాట్లాడటం.........అప్పుడప్పూడూ కూతుళ్ళు,...మనవళ్ళూ....
మనవరాలు తరచుగా వచ్చి పలకరించిపోయేవారు.........

శ్యామల అమ్మకు ఫోను తీసి ఇద్దాము అన్న ఆలోచన శేఖర్ కు కూడా
నచ్చి ఒక సెల్ ఫోనును కొనుక్కుని వచ్చి అమ్మకు పుట్టినరోజు
కానుకగా ఇచ్చాడు........ఇస్తున్నప్పుడు ఆ అమ్మ కళ్ళల్లో సంతోషం
కనపడింది......ఆ సెల్ పోనును ఎలా వాడాలో......అన్నీ చెప్పి.......
నెంబర్లన్నీ అందులోకి ఫీడ్ చేసి అమ్మకు ఇచ్చాడు శేఖర్.........

సెల్ ఫోను రాగానే ఇక అమ్మకు మంచి టైంపాస్ అయింది. కూతురు
ఫోను చేసి" అమ్మా! నువ్వుచేసే పొదినా పచ్చడి నీ అల్లుడికి చాలా
ఇష్టం.......ఎలా చేయాలో ఒకసారి చెప్పమ్మా! " అని అడగడం
పిల్లలు అమ్మమ్మా! బాగున్నావా అని రోజూ మాట్లాడటం చాలా బాగా
నచ్చింది ఆమెకు..........ఇలా రోజూ అందరితో మాట్లాడుతూ చాలా
సంతోషంగానే గడిపారు ఆవిడ.

ఒక నెల రోజులు గడిచాయి........అమ్మ మొహం బాగా వాడిపోయిందన్న
విషయం గమనించాడు శేఖర్...........అమ్మతో ఇలా అన్నాడు.

" ఏమ్మా! అలా ఉన్నావు.......ఆరోగ్యం బాలేదా? డాక్టరు దగ్గరికి
వెళదామా చెప్పు? "

దానికి ఆవిడ " అలాంటిదేమీ లేదులేరా? నువ్వు ప్రశాంతంగా
ఆఫీసుకు వెళ్ళు " అని అంది.

కానీ శేఖర్ మాత్రం ఏదో ఉందని గ్రహించాడు......ఆఫీసుకు వెళ్ళేముందు
మళ్ళీ అడిగాడు.....

" ఏమీ లేదని ఎందుకే అబద్దం చెపుతావు? నీ మొహమే చెపుతోంది.
పరవాలేదు చెప్పమ్మా!

" మరేమో! మరేమో! పెద్ద విషయం ఏమీ లేదుగానీ.....నాకు ఈ
సెల్ ఫోను వద్దురా! నువ్వే ఉంచుకో! " అంది అమ్మ.

" ఎందుకలా అంటున్నావు చెప్పు.........ఎవరైనా ఏమైనా అన్నారా?"
శేఖర్ అడిగాడు.

" ఎవ్వరూ ఏమీ అనలేదు కానీ..........ఈ ఫోను వచ్చాక నన్ను చూడటానికి
ఎవ్వరూ రావడంలేదు.......రోజూ ఫోనులో మాట్లాడుతున్నాగా అమ్మా!
అని కూతుళ్ళూ......మనవళ్ళు.....మనవరాళ్ళు అంటున్నారు......
ఈ సెల్ వచ్చాక వారు ఎవరూ రావడంలేదు.........ఇది నాకు వారిని
దూరం చేస్తోంది......నాకు ఈ వయస్సులో ఆప్యాయంగా నా పక్కన
కూర్చోని మాట్లాడే నా బిడ్డలు కావాలి కానీ.......ఫోనులో అన్నీ
మాట్లాడేసుకుని కలవకుండా ఉండే బంధాలు వద్దురా! నాకు ఈ
సెల్ వద్దు.......అమ్మమ్మా! అంటూ పరిగెత్తుకుని వచ్చి నామెడను
చుట్టుకునే బంధమే కావాలి........నా మాటవిని ఈ సెల్ నాకు వద్దు,"

అని అమ్మ అన్నారు.......అది విన్న శేఖర్ కూడా నిజమే కదా!
అనుకుని నవ్వుకున్నాడు.........

పెద్దవారితో రోజూ ఫోనులో మాట్లాడినా సరే దయచేసి మీ వీలును చూసు్కుని
వెళ్ళి కలవండి.......బంధాలను బలపరచుకోండి..........

No comments:

Post a Comment