Thursday, 8 December 2016

అత్యాశ ప్రమాధకరం

మనిషికి ఆశ ఉండటం సహజమే కాని.. అత్యాశ ప్రమాధకరం.. ఒక్కొక్క సారి ప్రాణాల మీదకు కూడ తెచ్చుకోవల్సి ఉంటుంది..
ఒక చిన్న స్టోరీ మీకోసం..
బాగా ఆశ కలిగిన మిడిల్ క్లాసు వ్యక్తి.. తన సంపాధనతో బ్రతకగలిగినా....
తన రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు దగ్గరకి వెళ్ళి తన అసంతృప్తి తెలియజేసాడు..
" ఓ రాజా నీ దగ్గర అంతులేని సంపద ఉంది మాలాంటి వారికి ఇస్తే అరిగేనా తరిగేనా.. అంటూ నిరుస్తాహంగా మట్లాడుతూ రాజు గారికి కొరకరాని కొయ్యగా మారాడు.."


విషయం అర్ధం చేసుకున్న రాజు.. మరుసటి రోజు ఉదయాన్నే వస్తే తనకి కొంత భూమిని ఇస్తా అని చెప్పి పంపాడు.. :-)

అనుకున్న విధంగానే రాజు దగ్గరకు వచ్చాడు ఆ వ్యక్తి..
రాజు.. అతనితో.. ఒక భూమిని చూపించి.. నువ్వు పరిగెత్తినంత దూరం పరిగెత్తు... ఎంత దూరం వెళ్ళి.. తిరిగి వస్తావో.. అంతా.. నీకే చెందుతుంది అని చెప్పాడు...
అతను పరుగు మొదలు పెట్టాడు.. o_O
ఆకలి.. దప్పికలు కూడా లెక్క చేయకుండా... పరిగెడుతున్నాడు... మధ్యహ్నం అయింది.. రాజు గారి కండిషన్ గుర్తొచ్చింది... తిరిగి రాజు గారిని చేరాలని...
ఇంకా పరిగెడితే ఇంకొచేం భూమి తనదవుతుందని ఆశ... అది అత్యాశ అయింది...
ఒంట్లో ఓపిక కొంచేం కొంచేం తగ్గుతుంది...
సాయంకాలం కావొస్తుంది... :-O
ఇంక చాలు.. అనుకుని.. తిరిగు పరుగు ప్రారంభించాడు..
కాని ఒంట్లో అస్సలు ఓపిక లేదు... సగం దూరం వచ్చేసరికి సూర్యాస్తమయం అయిపోతుంది... పరుగులో వేగం పెంచాడు...
కాని.. నీరసం వలన... రాజుని దగ్గర వచ్చే సరికి కళ్ళు తిరిగి పడిపోయాడు... బలహీనతతో ప్రాణాలు వదిలేసాడు... :-(

ఆశ అనేది మనిషి జీవితాన్ని నడిపే ఇందనం... మోతాదు మించితే అదే విషం..
అందుకే అత్యాశ అరోగ్యానికి హానికరం అంటారు.. :-)

No comments:

Post a Comment